ETV Bharat / state

ప్రొద్దుటూరులో క్రికెట్‌ బుకీలపై నిఘా - ప్రొద్దుటూరులో క్రికెట్‌ బుకీలు

ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమవుతున్న వేళ ప్రొద్దుటూరు క్రికెట్‌ బుకీలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ ప్రాంతంలో ఏటా ఐపీఎల్‌ సీజన్‌లో వంద కోట్ల రూపాయలకుపైనే పందేలు నిర్వహిస్తారనే అంచ‌నాలున్నాయి.

Proddaturu DSP Prasad Rao
ప్రొద్దుటూరు డీఎస్పీ ప్ర‌సాద‌రావు
author img

By

Published : Apr 9, 2021, 3:20 PM IST

ప్రొద్దుటూరు డీఎస్పీ ప్ర‌సాద‌రావు

కడప జిల్లా ప్రొద్దుటూరు ఒక‌టో పట్టణ పోలీస్​స్టేషన్‌కు కూత‌వేటు దూరంలోనే.. ముగ్గురు అన్నద‌మ్ములు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఏటా బెట్టింగ్ నిర్వహిస్తారని స్థానికంగా ప్రచారం ఉంది. గుర‌వ‌య్య తోట‌కు చెందిన మ‌రో వ్యక్తి.. ఓ బార్అండ్ రెస్టారెంట్​లో, మరో నిర్వాహకుడు ప‌ప్పుల‌బ‌ట్టీ బ‌జార్‌లోని గంగ‌మ్మ దేవాల‌యం వద్ద ఓ గ‌దిని ఏర్పాటు చేసి పందేలు కాస్తున్నారని స్థానికులంటున్నారు. అలాగే జిన్నారోడ్డులో.. ముగ్గురు అన్నద‌మ్ములు, కోట వీధికి చెందిన మ‌రో వ్యక్తి కూడా బెట్టింగ్‌ నిర్వహిస్తారని పలువురంటున్నారు.

ప్రొద్దుటూరు క్రికెట్‌ బుకీలకు తెలంగాణ‌, బెంగుళూరు, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోని బుకీలతోనూ సంబంధాలు ఉన్నాయి. ఇందులో కొందరికి రాజకీయ అండదండలుండడం.. వారి పందేలకు ఎదురులేకుండాపోతోందనే విమర్శలున్నాయి. పోలీసులు మాత్రం గతంలో అనేకమంది బెట్టింగ్​రాయుళ్లను అరెస్టు చేశామని, ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనూ వారిపై నిఘా పెట్టామని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా: శైలజానాథ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.