ETV Bharat / state

Student Sohit Dead: భవనం పైనుంచి పడిన సోహిత్.. రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తాం: ఎస్పీ అన్బురాజన్​

author img

By

Published : Jul 3, 2023, 4:28 PM IST

SP Anburajan on Student Sohit Dead: వైఎస్ఆర్ కడప జిల్లాలో విద్యార్థి మృతి ఘటనపై పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసును జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా పరిశీలిస్తున్నారు.  సీసీ ఫుటేజ్​ను పరిశీలించిన ఎస్పీ, విద్యార్థి స్కూల్ భవనం నుంచి పడిపోయినట్లు గుర్తించారు. పాఠశాల సిబ్బందితో పాటుగా యాజమన్యాన్ని లోతుగా విచారించారు. దీనిపై రేపు మీడియా సమావేశం పెట్టి సోహిత్​ మృతి కారణాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. సోహిత్ మృతిపై అతని తండ్రి నాగరాజు మాత్రం యాజమాన్యమే తన కొడుకు మృతికి కారణమని ఆరోపిస్తున్నారు.

Sohit Dead
Sohit Dead

SP Enquiry ON Student Death: వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట సమీపంలోని బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో రెండు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సొహిత్ అనే విద్యార్థి మృతిపై పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. సొహిత్ పాఠశాల భవనంపై నుంచి కిందపడి చనిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ పిల్లవాడిని భవనం పైనుంచి ఎవరైనా తోసేసారా లేక ప్రమాదవశాత్తు కింద పడిపోయారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. హాస్టల్ సిబ్బంది కొట్టి చంపారని విద్యార్థి తల్లిదండ్రులు రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

విద్యార్థి సోహిత్ మృతిపై వాస్తవాలు తెలుసుకోవడానికి ఎస్పీ అన్బురాజన్ పాఠశాలకు వెళ్లి స్వయంగా విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్​ను పరిశీలించారు. హాస్టల్లో పని చేస్తున్న 10మంది సిబ్బందితో పాటుగా.. స్టాఫ్​ను కూడా విచారించారు. సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించారు విద్యార్థి సోహిత్ శనివారం ఉదయం 5 గంటల సమయంలో పాఠశాల భవనం పైనుంచి కింద పడినట్లు కనిపించిందని పోలీసులు గుర్తించారు. పిల్లాడు కింద పడిపోవడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపైన సిబ్బందిని లోతుగా విచారించారు. దీనిపై రేపు మీడియా సమావేశం పెట్టి పిల్లవాడి మృతి కారణాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

విద్యార్థి సోహిత్ మృతి ఘటనలో పురోగతి

బాలలహక్కుల కమీషన్ విచారణ: విద్యార్థి మృతి ఘటనపై వాస్తవాలు తెలుసుకోవడానికి బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు లక్ష్మీదేవి పాఠశాలను సందర్శించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థి సోహిత్ మృతి ఘటనకు సంబంధించి తోటి విద్యార్థులతోపాటుగా.. పాఠశాల యాజమాన్యం, పోలీసులు ఇతరత్ర అంశాలను పరిగణలో తీసుకోని కారణాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. బాలుడి మృతిపై ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల నివేదికలు వచ్చిన అనంతరం చర్యలు చేపట్టనున్నట్లు లక్ష్మీదేవి పేర్కొన్నారు.

మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సోహిత్‌ తండ్రి నాగరాజు: విద్యార్థి సోహిత్‌ (11) తండ్రి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల సిబ్బంది కొట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపించారు. ఈ మధ్యే తమ కుమారుడిని (సోహిత్)ను కొత్తపేట వద్ద ఉన్న బీరం శ్రీధర్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చేర్పించినట్లు తెలిపారు. పాఠశాలలో చేర్పించేటప్పుడే లక్షన్నర ఫీజు కట్టామని పేర్కొన్నారు. అయితే, శుక్రవారం రాత్రి 9:30 నుంచి 10:30 దాకా సోహిత్ వసతి గృహంలోకి రాలేదని, పదిన్నర గంటల తరువాత ఏడ్చుకుంటూ వచ్చి పడుకున్నాడని.. సోహిత్ స్నేహితులు చెప్పినట్లు నాగరాజు పేర్కొన్నాడు. అయితే, తెల్లవారుజామున 5 గంటలకు కడుపు నొప్పి వస్తుందని పాఠశాల సిబ్బందికి చెప్పడంతో వారు నాగరాజుకు ఫోన్ చేసినట్లు తెలిపాడు. స్కూల్​కు వచ్చేలోపే తమ అబ్బాయిని పాఠశాల ఆవరణంలో పడుకోబెట్టినట్లు నాగరాజు వెల్లడించారు. వెంటనే బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే తన కొడుకు చనిపోయాడని డాక్టర్లు పరీక్షించి చెప్పినట్లు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.