అమరావతి రైతుల దీక్షలపై పాట విడుదల - రైల్వే కోడూరు వార్తలు
కడప జిల్లా రైల్వే కోడూరులో తెదేపా సాంస్కృతిక విభాగం రూపొందించిన ఓ పాటను ఆ పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహ ప్రసాద్ విడుదల చేశారు. అమరావతి రైతుల దీక్షలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో వీడియో సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.