కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా.. కడప జిల్లా పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కేసులు అధికమవకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. రాజంపేట సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల వరకే పట్టణంలో దుకాణాలు నడపాలని నిబంధనలు విధించారు. కరోనా కట్టడికి అందరు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాయంత్రం ఆరు గంటల తరువాత ఎవరూ బయటికి రాకూడదని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
రాజంపేటలో సాయంత్రం 6గంటల వరకే దుకాణాలు - కడప జిల్లా రాజంపేట వార్తలు
కడప జిల్లా రాజంపేటలో.. కరోనా కట్టడికి పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే దుకాణాలు తెరవాలని ఆంక్షలు విధించారు. సాయంత్రం 6గంటల తరువాత ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. రాజంపేట సీఐ చంద్రశేఖర్ తెలిపారు.