కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక్కరోజే 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం పట్టణ వాసులను ఆందోళన కలిగిస్తోంది. 21 మంది అనుమానితుల నుంచి వైద్యులు నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపారు. ఇందులో ఏడుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇటీవల దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాలకు వెళ్లి రావడంతో.. వీరికి వైరస్ సోకిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్లనుంచి బయటకు రాకుండా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి.