కడప జిల్లా సింహాద్రిపురం, తొండూరు మండలాల్లోని అగ్రహారం, కసునూరు గ్రామాల్లో తెగుళ్లతో దెబ్బతిన్న శనగ పంటను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సంవత్సరం అధిక వర్షపాతం నమోదు కావడంతో శనగ పంటకు వేరు కుళ్ళు తెగులు సోకి పంట దెబ్బతింది. ఈ విషయాన్ని రైతులంతా కడప ఎంపీ వైఎస్ అవినాష్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన సింహాద్రిపురం మండలంలోని అగ్రహారం, కసునూరు, సింహాద్రిపురం గ్రామాల్లో పంట పొలాలను ఓఎస్డీ అనిల్ కుమార్, మండల ఇన్ఛార్జ్ శివ ప్రకాష్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న పంటకు పూర్తిగా పరిహారం అందించేలా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అవినాష్ తెలిపారు.
ఇవీ చదవండి...ప్రకృతి వ్యవసాయం... పంట దిగుబడి అధికం