![దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8281408_190_8281408_1596464747290.png)
కడప జిల్లా దువ్వూరు మండలంలో పోలీసులు తనీఖీలు నిర్వహించారు. ఇడమడక తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా బైక్పై మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 161 మద్యం బాటిళ్లతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైదుకూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్, బాలయ్యలుగా గుర్తించారు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ నుంచి మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి