ETV Bharat / state

'ప్రైవేటు ఇంజనీరింగ్ అధ్యాపకులకు వేతనాలు ఇవ్వాలి' - kadapa district newsupdates

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఇంజనీరింగ్ అధ్యాపకులకు వేతనాలు ఇవ్వటం లేదని.. ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి అన్నారు. దాదాపు రాష్ట్రంలో 50 వేల మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Salaries of private engineering faculty should be paid
'ప్రైవేటు ఇంజనీరింగ్ అధ్యాపకులకు వేతనాలు ఇవ్వాలి'
author img

By

Published : Feb 5, 2021, 7:53 PM IST

ప్రైవేటు ఇంజనీరింగ్ అధ్యాపకులకు గత 3 మాసాల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నారని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 350 ఇంజనీరింగ్ కళాశాలలో 50 వేల మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారికి వేతనాలు ఇవ్వడం లేదని కడప ప్రెస్ క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కళాశాలలకు రప్పించి.. వివిధ రకాల పనులు చేయించుకుంటూ.. వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని ఖండించారు. ప్రభుత్వం స్పందించి వారికి జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అధ్యాపక రంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను కలిసిన ఎస్‌ఈబీ చీఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.