ETV Bharat / state

ఆర్టీసీ సిబ్బంది కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం

author img

By

Published : Apr 3, 2021, 7:43 PM IST

ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది, కార్మికుల ఆరోగ్యం కోసం అధునాతన సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడపలో త్వరలో ప్రారంభం కానుంది. దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిని ఈ నెలలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన 25 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి.. ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.

RTC staff Super specialty hospital
ఆర్టీసీ సిబ్బంది కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్​ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది, కార్మికుల ఆరోగ్యం కోసం అన్ని జిల్లాల్లో డిస్పెన్సరీలు పని చేస్తున్నాయి. విజయవాడలో మాత్రం ఆసుపత్రి నడుస్తోంది. రాష్ట్రంలోని ఆర్టీసీ సిబ్బందిలో ఎవరికి మేజర్ చికిత్స, సర్జరీ అవసరమైనా విజయవాడకు తరలించేవారు. దీన్ని అధిగమించేందుకు కడప నగరంలో ఆధునిక హంగులతో 3 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. ఇప్పటికే ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.

లక్ష మందికి ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు..

రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన 25 వేల మంది ఆర్టీసీ సిబ్బంది.. కార్మికుల కోసం ఈ ఆసుపత్రి నిర్మించారు. 20 పడకల ఆసుపత్రికి రెండేళ్ల కిందట శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు పూర్తి చేశారు. 25 వేల మంది సిబ్బందితో పాటు.. వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు లక్ష మందికి ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఈ నెలలో సీఎం జగన్‌ జిల్లాకు వస్తున్న సందర్భంలో.. కడపలోని ఆర్టీసీ ఆసుపత్రిని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే.. ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కడపలో పర్యటించారు. ఆసుపత్రిలో వసతులు, పరికరాలు, పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై.. సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ సిబ్బందికి ఎంతో మేలు..

3 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన.. ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 20 పడకల ఉన్నాయని.. అధికారులు తెలిపారు. నాలుగు రకాల ప్రధాన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. జనరల్‌ మెడిసన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఆఫ్తమాలజీ వైద్య సేవలు ఇక్కడ అందిస్తారు. జనరల్‌ ఓపీ కూడా ఉంటుంది. మరికొన్ని వైద్య పరికరాల కొనుగోలుకు.. 2 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. ఇప్పటికే 20 పడకల గదలను, అందులో ఆధునిక మంచాలను రోగుల కోసం సిద్ధంచేశారు. ఆపరేషన్‌ థియేటర్‌ పూర్తి అయ్యింది. నలుగురు స్పెషలిస్టు వైద్యులు, కన్సల్టెంట్ వైద్యులు, మహిళా డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు. త్వరలోనే.. X-RAYయంత్రం, ఇతర రకాల వైద్య పరికరాలు ఇక్కడికి రానున్నాయి.150 రకాల రక్త పరీక్షలు చేసేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ సిబ్బందికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు అంటున్నారు.

ఈ నెల 26న ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి ముఖ్యమంత్రి జగన్‌ వచ్చేఅవకాశం ఉండటంతో.. అదే రోజున ఆసుపత్రిని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇవీ చూడండి...

'సొంత కుటుంబానికే న్యాయం చేయని సీఎం.. రాష్ట్రానికి ఏం చేస్తారు..?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.