ETV Bharat / state

ప్రగతి రథం.. కొత్త మార్గం

ఆర్టీసీకి చెందిన సరకు రవాణా వాహనాలను తక్కువ అధ్దెకు ఇచ్చేందకు సిద్ధమని కడప డిపో మేనేజర్​ ప్రకటన చేశారు. లాక్​డౌన్​ కారణంగా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రత్యేక పథక రచన చేశామన్నారు.

rtc gives low interest rates for Freight vehicles says kadapa depot manager
ఆర్టీసీ బస్టాండులో నిలిచిపోయిన వాహనాలివీ
author img

By

Published : Apr 27, 2020, 4:42 PM IST

కరోనా కష్టకాలంలో ఆగిపోయిన ప్రగతిరథాలను ముందుకు నడిపించడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక పథక రచన చేసింది. జిల్లాలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. ఈ తరుణంలో రవాణా వ్యవస్థను పూర్తిగా నిషేధించారు. రైతులు పండించిన వాణిజ్య పంటల ఉత్పత్తులు, కూరగాయలను తరలించేందుకు ఆర్టీసీకి చెందిన సరకు రవాణా వాహనాల (డీజీటీ)ను తక్కువ అద్దెకే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కడప డిపో మేనేజరు నిరంజన్‌ ప్రకటించారు.

వ్యవసాయోత్పత్తులను వీటి సాయంతో ఎగుమతి- దిగుమతి వేగంగా సాగించవచ్చని వివరించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రావడానికి అనుమతి ఉందన్నారు. డీజీటీలు వద్దునుకున్న వారికి బస్సులనూ ఇదే తరహా అవసరాలకు అద్దెకు ఇస్తామని, సరకులు అమర్చుకోవడానికి సీట్లనూ తొలగిస్తామని చెప్పారు. గతం కన్నా తక్కువ అద్దె ఉంటుందన్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీకి రోజుకు రూ.కోటి రూపాయల నష్టం వాటిల్లుతోంది. గడచిన 34 రోజులుగా సంస్థ రూ.34 కోట్ల వరకు నష్టాలు మూటగట్టుకుంది. ఎనిమిది డిపోల పరిధిలో 900 బస్సులు నిలిచిపోయాయి. సంస్థ సిబ్బందిని బందోబస్తు విధులకు వినియోగించుకోవడం ప్రస్తావనార్హం.

ఇదీ చదవండి:

'అందుబాటులో ఉన్నాం.. వినియోగించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.