కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరగడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ ఉండవన్నారు. చిన్నచిన్న తప్పిదాల వల్లే ఘోర ప్రమాదాలు జరుగుతున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. ఒక బస్సులో డ్రైవర్ నే నమ్ముకుని 40 మంది ప్రయాణిస్తుంటారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీసీ సంస్థను ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రాలు, కరపత్రాలను డిపో మేనేజర్ బాలాజీతో కలిసి ఆవిష్కరించారు.
ఇవీ చదవండి: