ETV Bharat / state

వేర్వురు రోడ్డు ప్రమాదాలు: యువకుడు, చిన్నారి, వృద్ధుడు మృతి - ROAD ACCIDENT NEWS IN KURNOOL

చేతికొచ్చిన కుమారుడుని, తన బుజ్జి బుజ్జి మాటలతో నవ్వించే ఓ చిన్నారిని, కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వృద్ధుడిని మృత్యువు కబళించింది. ఆ కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చింది. ఈ విషాద ఘటనలు విశాఖ, కర్నూలు, కడప జిల్లాలో జరిగాయి.

వేర్వురు చోట్ల రోడ్డు ప్రమాదాలు: యువకుడు, చిన్నారి,వృద్ధుడు మృతి

author img

By

Published : Dec 11, 2020, 8:16 AM IST

విశాఖ అనకాపల్లి డైట్ కళాశాల ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అనకాపల్లి జలగలమదం కూడలి వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న రాజశేఖర్ మృతి చెందాడు. జనార్దన్ అనే మరో విద్యార్థికి గాయాలయ్యాయి. మృతుడు మాడుగుల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు రాజశేఖర్​గా గుర్తించారు. మరికొన్ని నెలల్లో చదువు పూర్తి చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకున్న కొడుకు ప్రమాదంలో చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది.

లారీ ఢీ కొని ఆరు సంవత్సరాల చిన్నారి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని చిన్నటేకురు వద్ద ఆరు సంవత్సరాల నందిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా లారీ వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. రైల్వేకోడూరు రంగనాయకులపేటకు చెందిన ఖాదర్ వల్లిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తిరుపతి నుండి రైల్వే కోడూరుకు మోటార్ సైకిల్​పై వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి

అనారోగ్యంతో సైనికుడు వెంకన్న మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.