కడప జిల్లా చక్రాయపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. చక్రాయపేటలో ఆర్ఎంపీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఇర్ఫాన్ బాషా అనే వ్యక్తి.. వైద్యం నిమిత్తం కుమారకాల్వ గ్రామానికి వెళ్లాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నది ప్రవాహం ఎక్కువ కావడంతో.. ఇర్ఫాన్ బాషా కుమారకాల్వలోనే ఉండిపోయాడు.
నీటి ప్రవాహం కొంచెం తగ్గుముఖం పట్టడంతో.. గ్రామస్తుల సాయంతో నది దాటేందుకు ప్రయత్నం చేశాడు. అయితే.. ప్రమాదవశాత్తూ నలుగురూ నీటిలో కొట్టుకుపోయారు. అయితే.. వారిలో ముగ్గురు చెట్టును పట్టుకుని సురక్షితంగా బయటపడగా.. ఇర్ఫాన్ మాత్రం వరద నీటిలో(RMP DOCTOR MISSING IN PAPAGNI RIVER FLOOD) గల్లంతయ్యాడు.
ఇర్ఫాన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారం రోజులుగా తండ్రి వస్తాడని ఎదురుచూస్తున్న భార్యా పిల్లలకు.. ఈ విషయం తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు. సదరు వైద్యుని ఆచూకీ కోసం నది దగ్గర పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఫైర్ సిబ్బంది, బోటు సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు తహసీల్దార్ రాజనర్సింహ నరేంద్ర ఆచారి తెలిపారు.
ఇదీ చదవండి: