కడప జిల్లా రాజంపేట పురపాలక డంపింగ్ యార్డు వద్ద ఎటు చూసినా చెత్త కుప్పలు దర్శనమిచ్చేవి. డంపింగ్ యార్డు ప్రధాన ద్వారం చెత్తతో పూర్తిగా మూసుకుపోయి ఉండేది. చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల స్థానికులు దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు పడేవారు. ప్రజల సమస్యలను వివరిస్తూ గత నెల 8న ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ప్రధాన ద్వారానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టారు. దీని వల్ల డంపింగ్ యార్డుకు కొత్తరూపు వచ్చింది.
ఇదీ చూడండి: