ETV Bharat / state

ఎర్రచందనం యథేచ్ఛగా దేశ సరిహద్దులు దాటుతోంది..! - Red Sandal Smuggling from AP news

ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమంగా రవాణ చేస్తూ కోట్ల రూపాయల ధనాన్ని బడా స్మగ్లర్లు వెనకేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నా ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి. పోలీసు, అటవీశాఖ సిబ్బంది ఉదాసీన వైఖరి తోడవ్వడం వల్ల యథేచ్ఛగా ఎర్రచందనం దేశ సరిహద్దులు దాటుతోంది. తమిళ కూలీలు, స్థానికంగా ఉన్న ముఠాల సాయంతో బడా స్మగ్లర్లు చేతికి మట్టి అంటకుండానే అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. కడప జిల్లా పోలీసు రికార్డుల్లో మాత్రం దాదాపు 50 మంది బడా స్మగ్లర్లు ఎర్రచందనం కొల్లగొట్టి విదేశాలకు తరలించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.

red-sandal-
red-sandal-
author img

By

Published : Nov 18, 2020, 8:06 PM IST

యథేచ్ఛగా దేశ సరిహద్దులు దాటుతున్న ఎర్రచందనం

ఎర్ర చందనం... దీనికున్న విలువ చాలా ఎక్కువ. అందుకే...ఎర్ర బంగారం అని పిలుస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కేవలం నాలుగు జిల్లాల్లోనే లభిస్తుంటుంది. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో మాత్రమే లభిస్తుంది. ఈ జిల్లాల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. నాలుగు జిల్లాలో మొత్తంగా దాదాపు 5 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉండగా... ఒక్క కడప జిల్లాలోనే 3.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనానికి చాలా గిరాకీ ఉంది. అందుకే లక్షలు, కోట్లు చెల్లించి మరీ దిగుమతి చేసుకుంటుంటారు. కానీ ఈ చెట్లను నరకడం, ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం చట్టరీత్యా నేరం. కానీ డబ్బులు సంపాదించాలనుకునే కేటుగాళ్లు... ప్రభుత్వం కళ్లు కప్పి అక్రమంగా దేశం దాటిస్తుంటారు. అందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు.

ఎర్రచందనం దుంగలను మూడు రకాలుగా విభజించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. మొదటి రకం దుంగలకు మార్కెట్లో చాలా డిమాండు ఉంది. అంతర్జాతీయ మార్కెట్​లో టన్ను కోటి రూపాయల వరకు పలుకుతోందంటే... పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో సైతం టన్ను కోటి రూపాయలకు పైగానే కొనుగోలు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ధర ఉండడం వల్ల ఎంత కష్టమైనా ఎర్రచందన అక్రమ రవాణాకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో వీటి జాడ ఎక్కువగా ఉండడం వల్ల అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్మగ్లర్ల దృష్టి ఇక్కడ పడింది.

వాస్తవానికి ఎర్రచందన స్మగ్లింగ్‌ చాలా పెద్ద వ్యవహారం. తెర వెనుక నుంచి చాలా మంది ఇదంతా నడిపిస్తుంటారు. పోలీసులకు చిక్కేది మాత్రం కూలీలే. వారి నుంచి అసలు స్మగ్లర్‌ వివరాలు రాబట్టాలని చూసినా...పెద్దగా ప్రయోజనం ఉండదు. కొన్ని కొన్ని సార్లు కూలీలు స్మగ్లింగ్‌లో ఎన్నో దారుణాలకు ఒడిగడుతుంటారు. అందుకు వారికి అందే భారీ నగదే కారణం. సాధారణంగా ఓ చెట్టు కొట్టి.. స్మగ్లర్ల స్థావరానికి చేర్చేందుకు ఒక కూలీకి ఒక్కరాత్రి సమయం పడుతుంది. ఇందుకు గానూ... కూలీలకు స్మగ్లర్లు వేల రూపాయలు ఇస్తుంటారు. ఫలితంగా... తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆత్యాశతో.... చట్టవిరుద్ధమైన ఈ పనులు చేస్తుంటారు. చెట్లను నరికేందుకు స్మగ్లర్లు ఎక్కువగా తమిళ కూలీలను వినియోగిస్తుంటారు. చెట్ల నరికివేత, తరలింపులో తమిళులే ఎక్కువగా పోలీసులకు చిక్కుతుంటారు.

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీలోతో పాటు ఎర్రచందనానికి ఎక్కువగా డిమాండ్‌ ఉన్న చైనాకు ఇక్కడి నుంచి అక్రమంగా తరలిపోతోంది. ఈ రవాణాకు కొందరు పోలీసు, అటవీశాఖ సిబ్బంది సహకరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. బడా స్మగ్లర్లకు స్థానికంగా సహకరించేందుకు జిల్లాల స్థాయిలో హైజాక్ గ్యాంగ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇవి స్మగ్లర్ల నుంచి అందే ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తుంటాయి. రాష్ట్రంలో ఉన్న స్మగ్లర్ల నుంచి ఇతర రాష్ట్రాల్లో మకాం వేసిన అంతర్జాతీయ స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి బెంగళూరు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లోని గోదాములకు తరలించి.. వీలు చిక్కనప్పుడు కంటైనర్లలో విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. చైనాలో ఈ కలపకు ఎక్కువ డిమాండ్‌ ఉన్న కారణంగా...ఎక్కువగా అక్కడికే తరలిపోతోంది.

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నా... ఇప్పటి వరకు పూర్తిగా నిరోధించలేకపోయారు. ఇందుకు పటిష్ఠ నిఘా లేకపోవడమే కారణం. కొన్నిసార్లు స్థానిక స్మగ్లర్ల పట్టుబడుతున్నా...అంతర్జాతీయ స్మగ్లర్ల సభ్యులు మాత్రం చిక్కడం లేదు. కడప జిల్లా పోలీసు రికార్డుల ప్రకారం... 2014 నుంచి 2018 వరకు 50 మంది బడా స్మగ్లర్లు పట్టుబడగా...వారి అనుచరులను వందల మందిని అరెస్టు చేశారు. ఇటీవల అంతర్జాతీయ స్మగ్లర్ బాషాభాయ్​ని పట్టుకున్నారు. అతనితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. 2014 నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న బాషాబాయ్​పై కడప జిల్లాలో 14 కేసులు, అనంతపురం జిల్లాలో 11 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగతా అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది. బడా స్మగ్లర్లల్లో ఎక్కువగా..చైనా, జైపూర్, దిల్లీ, చెన్నై, కర్ణాటక, మలేసియా, దుబాయ్‌లకు చెందిన వారుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పట్టుబడుతున్న అక్రమ రవాణాదారులపై పోలీసులు పీడీ యాక్ట్‌ను నమోదు చేస్తున్నారు. నాలుగు సార్లు ఈ పనిలో పట్టుబడితే...పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. 2014 నుంచి 2018 వరకు 68 మంది స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించగా... 2019, 2020లో ఇప్పటి వరకు పీడీ చట్టం కింద ఒక్క కేసూ నమోదు కాలేదు. ఇటీవల అంతర్జాతీయ స్మగ్లర్‌ బాషాభాయ్ అరెస్ట్ నేపథ్యంలో... అతనితో పాటు ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ చట్టం కింద ఏడాది జైలు శిక్ష విధిస్తున్నారు. కాగా... జైలు శిక్ష అనంతరం...చాలా మంది ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఈ అక్రమ రవాణాలో స్మగ్లర్లు కొన్ని సార్లు దారుణాలకు పాల్పడుతున్నారు. కూలీలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపించి... చెట్లను నరికిస్తున్నారు. తర్వాత వారినీ మోసం చేసి, కొన్ని సార్లు బెదిరించి... వారి నుంచి ఎర్రచందనాన్ని దొంగిలిస్తున్నారు. అందుకు బడా స్మగ్లర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎర్రచందనాన్ని అడవుల నుంచి గమ్య స్థానాలకు చేర్చడానికి తమిళ కూలీలతో లక్షల్లో ఒప్పందం చేసుకుని.... దుంగలు అడవులు దాటాక... స్థానిక ముఠాలు కూలీల వాహనాలను వెంబడించి దుంగలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇలా వెంబడించే క్రమంలోనే ఈ నెల 2న వల్లూరు మండలం గోటూరు వద్ద మూడు వాహనాలు ప్రమాదానికి గురై ఐదుగురు తమిళ కూలీలు సజీవ దహనం అయ్యారు.

ఈ స్మగ్లింగ్‌ వ్యవహారంలో వెనుక కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి సహకారం అందుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా... చర్యలకు మాత్రం సాహసించడం లేదు. అధిక డబ్బు ఆశ చూపి...నిరుపేద తమిళ కూలీలను ఈ తప్పుడు పనులకు ఒప్పిస్తున్నారు. అడవుల్లో చెట్లు నరికి...తరలించే క్రమంలో చాలాసార్లు మృత్యువాత పడుతున్నారు. ఇలా 2017లో ఒంటిమిట్ట చెరువులో పడి ఏడుగురు తమిళ కూలీలు మృతి చెందారు. కనీసం వీళ్ల మృతదేహాలను తీసుకెళ్లడానికి కూడా స్తోమత లేని దీనస్థితిలో తమిళ కూలీల కుటుంబాలున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో విధించిన...లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో మరింత మంది ఈ అక్రమ రవాణాకు అంగీకరిస్తున్నారు. పార్టీలకతీతంగా అరుదైన ఎర్రచందనం సంపద కాపాడటానికి ఏం చేయాలనే విషయమై పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే షరామామూలుగా ఎర్రబంగారం విదేశాలకు తరిలి పోతుందనడంలో సందేహం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.