యూడీజీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులను సాకుగా చూపి.. కడప జిల్లా బ్రహ్మణపల్లెలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి మంగళం పాడారు. కొవిడ్ వేళ గుంపులుగా ఉండకూడదన్న నిబంధనలు పక్కనపెట్టి.. రేషన్ పంపిణీ చేపట్టారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ చిన్న గదిలో రేషన్ పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వారికి అధికార పార్టీ నాయకుల అశీస్సులున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నాసిరకం బియ్యం పంపిణీ చేస్తున్నారంటూ నిలదీస్తే.. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం ఇస్తున్నామని డీలర్ చెబుతున్నారని వినియోగదారులు వాపోయారు.
ఇదీ చదవండి: rare hawks: కడప గడపలో అరుదైన గద్దలు