చౌక దుకాణం విషయంలో తనకు న్యాయం చేయాలంటూ కడప జిల్లా ఖాజీపేటకు చెందిన డీలరు లక్ష్మీదేవి నిరసన చేపట్టారు. న్యాయం జరిగేదాకా ఇంట్లో నుంచి బయటకు రానంటూ దీక్షకు ఉపక్రమించారు. బలవంతంగా బయటకు లాగాలని చూస్తే ఇంట్లో విద్యుత్ తీగ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు 11న ఖాజీపేటలోని 16వ చౌకదుకాణంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 6ఏ కేసు నమోదు చేశారని అన్నారు. అదే నెల 14న నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నట్లు డీలర్ తెలిపారు. దీనిపై సంయుక్త పాలనాధికారికి ఫిర్యాదు చేయగా... స్వాధీనం చేసుకున్న సరుకులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా సస్పెన్షన్ ఉత్తర్వులు చేతిలో పెట్టారని రేషన్ డీలర్ వాపోయారు.
ఇదీ చదవండి: