కడప జిల్లా బద్వేలులో ఉప్పర/సగర కుల కార్పొరేషన్ చైర్మన్గా రమణమ్మను నియమించారు. ఈ సందర్భంగా వైకాపా శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పాలాభిషేకం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ప్రగతికి బాటలు వేస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పదవికి
న్యాయం చేస్తామని అన్నారు. ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: