మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సిట్ నివేదికలను కడప జిల్లా పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 సిట్ బృందాలు దర్యాప్తు చేసిన నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు... రేపట్నుంచి అనుమానితులను అధికారికంగా విచారించనున్నారు. సీబీఐ విచారణ అధికారి నేతృత్వంలో కడపలోనే అనుమానితులను విచారించే అవకాశం ఉంది.
వివేకా హత్యకేసు: సిట్ నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ
వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దిల్లీ, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందంగా వచ్చిన సీబీఐ అధికారులు కడపలోనే ఉండి విచారణ జరుపుతున్నారు. హత్య కేసులో మూడు సిట్ లు చేసిన దర్యాప్తు నివేదికలను సీబీఐకి పులివెందుల పోలీసులు అందజేశారు.
వివేకా హత్యకేసు: పోలీసుల నుంచి సిట్ నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ