అనారోగ్యంతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ భరోసా ఇచ్చారు. కడపలో పని చేస్తున్న వరప్రసాద్, ఇస్మాయిల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
వీరి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. పోలీసు సిబ్బంది.. తమ ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇవీ చదవండి: