ETV Bharat / state

మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయానికి! - శ్మశానం కోసం కానపల్లె ఎస్సీ కాలనీ నిరసన

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జీవితమంతా గడిపే మనిషి.. చివరికి చేరేది శ్మశానానికే. అలాంటి రుద్రభూమి లేని కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయన్నది నిజం. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన కానపల్లె ఎస్సీ కాలనీ పరిస్థితి ఇదే. తమకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట.. మృతదేహంతో వారు ఆందోళనకు దిగారు.

protest for burriel ground
శ్మశానం ఏర్పాటుకు ఆందోళన
author img

By

Published : Oct 13, 2020, 7:13 PM IST

కానపల్లె ఎస్సీ కాలనీ వాసులు.. ఓ మృత దేహంతో కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. శ్మశాన వాటిక ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. శ్మశానం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా తహసీల్దార్ నజీర్ అహ్మద్​ను కోరారు. ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:

రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.