ETV Bharat / state

పంట రుణ ధర పెంపుపై ప్రతిపాదన - కడప జిల్లా వ్యవసాయ న్యూస్

ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న పంటలకు సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దుక్కుల నుంచి పంట సాగు, కోతల వరకు విపరీతమైన ఖర్చులుంటున్నాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోయి అన్నదాత అవస్థలు పడుతున్నారు.

పంట రుణ ధర పెంపుపై ప్రతిపాదన
పంట రుణ ధర పెంపుపై ప్రతిపాదన
author img

By

Published : Jan 24, 2021, 7:13 PM IST

పంట సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న పంటలకు దుక్కుల నుంచి పంట సాగు, కోతల వరకు విపరీతమైన ఖర్చులుంటున్నాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోయి అన్నదాత అవస్థలు పడుతున్నారు. మరోపక్క ఏటా బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులు జిల్లాలో అధికంగానే ఉన్నారు. బ్యాంకర్లు ఇచ్చే రుణాలను తీర్మానిస్తూ నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి కూడా పంట రుణాలిచ్చేందుకు ధరలు నిర్ణయిస్తూ జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. జిల్లాలో సుమారు 4.88 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పూలసాగు, సుగంధద్రవ్య పంటలను సాగు చేస్తున్నారు. ఏటా పలు కొత్త రకాలను జిల్లా రైతులు పరిచయం చేస్తున్నారు. వ్యవసాయ పంటలకు మించి అధిక విస్తీర్ణంలో ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు.

పంట రుణ ధర పెంపుపై ప్రతిపాదన
పంట రుణ ధర పెంపుపై ప్రతిపాదన

కడప జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలివ్వాలంటే స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలా ప్రతి జిల్లా నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో ధరలు నిర్ణయించి ఆప్కాబ్‌కు పంపుతారు. అక్కడ ఆమోదం పొందిన తరువాత జిల్లాలకు వస్తుంటుంది. సాధారణంగా డిసెంబరులో సమావేశం నిర్వహించి పంపించాల్సి ఉంటుంది. ఈసారి కొంత ఆలస్యమైందని అధికారులంటున్నారు. ఇటీవల డీసీసీబీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు పంపారు. రానున్న ఖరీఫ్‌లో ఎకరాకు ఎంత రుణమివ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుని ప్రతిపాదనలు పంపారు. దాని ప్రకారం 10 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. వరి, వేరుసెనగ, జొన్న, మొక్కజొన్న, కందులు, తమలపాకు, పసుపు, మామిడి, జామ, సపోట, శనగ, తదితర పంటలకు రుణ ధరలను నిర్ణయిస్తూ ఆమోదానికి పంపారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి సరాసరి (ఆవరేజ్‌) తీసుకుని ఆయా ప్రాంతాల ధరలు నిర్ణయించ నున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి మత్స్య రంగానికి సైతం ధరలు నిర్ణయించారు. మత్స్య సంపదను ఆధారంగా చేసుకుని జీవించే కార్మికులకు వలలు, ఇతర సామగ్రి కోసం రుణాలు పొందేందుకు ధరలు నిర్ణయిస్తూ ప్రతిపాదనలు పంపించారు. ఈ విషయమై డీసీసీబీ సీఈవో రఘునాథరెడ్డి మాట్లాడుతూ పంట రుణాలిచ్చేందుకు ధరలు నిర్ణయిస్తూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అక్కడ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.

ఇవీ చదవండి: మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.