కడపలో నాసిరకం విత్తనాల పంపిణీ...రైతుల ఆందోళన - కడపలో రైతులు ఆందోళన
కడప జిల్లాలో పంపిణీ చేస్తున్న శనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగులో రైతులకు మట్టితో కలిసిన విత్తనాలు అందిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.