కడప జిల్లా బి. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంకమరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బద్వేల్ ఉపఎన్నికల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్న ఓ కారులో రూ. 75 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు పట్టుబడ్డాయి. అయితే బంగారం కొనుగోలు చేసిన వ్యాపారి మణికంఠ వద్ద సరైన ఆధారాలు లభించకపోవటంతో బంగారం స్వాధీనం చేసుకుని అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో సీఎం జగన్