వివిధ జిల్లాల్లో పోలీసులు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్క్ ధరించని వాహనదారులకు జరిమానాలు సైతం విధించారు.
కడప జిల్లాలో..
కడప జిల్లా ఒంటిమిట్ట పీఎస్ పరిధిలోని రాజంపేట రోడ్డుపై కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ప్రజలకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కు ధరించకుండా వెళుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాస్కులు అందజేశారు. మాస్క్ ధరించిన వారికి గులాబీ ఇచ్చి అభినందించారు. మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా అనకాపల్లిలో మాస్క్ లేకుండా బహిరంగంగా తిరుగుతున్న వారికి రూ.135 చొప్పున అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర రావు జరిమానా విధించారు. 110 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పట్టణ సీఐ సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకు ట్రాఫిక్ పోలీసులు మాస్కు లేకుండా ప్రయాణించే వారిపై కొరడా ఝళిపించారు. పట్టణ ప్రధాన రహదారిలో తనిఖీలు చేసి మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న 145 మంది వాహనదారులకు జరిమానా విధించి రూ.21,670 వసూలు చేశారు.
ఇదీ చదవండి