Red sandalwood smugglers: వైఎస్సార్ జిల్లా నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 16 మంది స్మగ్లర్లను బ్రహ్మంగారిమఠం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లంకమల్ల అటవీ ప్రాంతంలో.. ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో మైదకూరు డీఎస్పీ వంశీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో.. దుండగుల వాహనాలను వెంబడించి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: