Eight accused have been arrested: వైఎస్సాఆర్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగిన వైసీపీ నేత హత్యకు కారణం ప్రేమ వివాహమే అని తేలింది.. విచారించిన పోలీసులు.. 8 మంది నిందితులను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వైయస్సార్ జిల్లా కమలాపురంలో ఈ నెల 7వ తేదీ జరిగిన ఏ జయశంకర్ రెడ్డి హత్య కేసులో జయశంకర్ రెడ్డి కుమారుడు నవీన్ కళ్యాణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సీఐ సత్తిబాబు.. కేసు నమోదు చేశారు. జయశంకర్ రెడ్డి పెద్ద కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి.. శేఖర్ రెడ్డి కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడని.. పల్లె రామసుబ్బారెడ్డి ఆయన సోదరుడు శేఖర్ రెడ్డిపై కక్షపెంచుకొని హత్య చేసినట్లు విచారణలో నిందితులు తెలిపారని డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీన జయశంకర్ రెడ్డి గంగవరం పొలంలోని మూలగడ్డ వద్ద పొలానికి నీరు పారకట్టే సమయంలో రామ సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి మిగిలిన ఆరుగురు నేరస్థులు కలసి శంకర్రెడ్డిని రాడ్లతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారని.. డీఎస్పీ వెంకట శివారెడ్డి వెల్లడించారు. ఈ 8 మందిని అరెస్టు చేయడమే కాకుండా ఇంకా లోతైన దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరి కుట్ర ఉన్నా.. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏం జరిగిందంటే.. వైసీపీ నేత శంకర్ రెడ్డిని తన పొలంలో వ్యవసాయ మోటార్ వద్ద చేనుకు పారకట్టే సమయంలో దాడి చేశారు. తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం తెలుసుకున్న.. స్థానిక ఎస్సై చిన్న పెద్దయ్య తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఐ సత్తిబాబు ఎస్సై చిన్న పెద్దయ్య కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సీఐ సత్తిబాబు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం రామసుబ్బారెడ్డి తమ్ముడి కుమార్తెను చనిపోయిన వైసీపీ నేత శంకర్ రెడ్డి కుమారుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఆ కేసు స్థానిక స్టేషన్లో కూడా నమోదయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విషయం గురించే ఈ హత్య జరిగి ఉంటుందని అక్కడ వారు భావిస్తున్నారు. పూర్తి సమాచారం విచారణ అనంతరం తెలుస్తుందని తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేత శంకర్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించి తానున్నానంటూ.. కుటుంబ సభ్యులను ఓదార్చారు హత్యకు కారకులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: