వాతావరణశాఖ హెచ్చరికతో కడప జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలపై నివర్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందునా ఆ ప్రాంతాలకు స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు, పాతబడిన వంతెనల వద్ద నివాసం ఉండే ప్రజలను అప్రమత్తం చేశామని ఎస్పీ తెలిపారు.
సీఎం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడుతూ వీడియో కాన్ఫరెన్సులో ఆదేశాలు జారీ చేశారన్న ఆయన....ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చీకటి ప్రదేశాల్లో ఆస్కా లైట్ ద్వారా వెలుతురు వచ్చే ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ముందస్తు తర్ఫీదు ఇచ్చి తుపాను ప్రభావిత ప్రాంతాలకు పంపారు.
ఇదీ చదవండి: