ETV Bharat / state

భాజపా నేతకు ప్రధాని ఫోన్... ఆరోగ్యంపై ఆరా! - pm modi phone to bjp senior leader balireddy

ప్రొద్దుటూరుకు చెందిన భాజ‌పా సీనియ‌ర్ నాయ‌కులు న‌రాల బాలిరెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి.... స్వయంగా యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాల‌క్షేపం..త‌దిత‌ర విష‌యాల‌పై మాట్లాడారు. ప్రధాని ఫోన్‌చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని బాలిరెడ్డి చెప్పారు.

pm modi phone to  bjp senior leader balireddy
భాజపా నేత బాలిరెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
author img

By

Published : Apr 27, 2020, 7:58 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాజపా సీనియర్‌ నాయకుడు నరాల బాలిరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం స్వయంగా ఫోన్‌ చేసి యోగక్షేమాలు విచారించారు. ఆరోగ్యం ఎలా ఉన్నదీ అడిగారు. ‘కాలక్షేపం ఎలా జరుగుతోంది.... లాక్‌డౌన్‌ వేళ జాగ్రత్తలు తీసుకుంటున్నారా...’ అంటూ కుశల ప్రశ్నలతో మాటామంతీ కొనసాగించారు. ‘నాకు ప్రధాని ఫోన్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ నరాల బాలిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇదివరకే తను మూడుసార్లు మోదీని కలిసి మాట్లాడినట్లు చెప్పారు. బాలిరెడ్డి 1958లో జన్‌సంఘ్‌లో చేరారు. ఆ పార్టీలో కార్యకర్తగా ఉంటూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించాక అందులో చేరి, కడప జిల్లాలో కీలక భూమిక పోషించారు. ఆయన ప్రజాదరణ దర్పణంగా.. 1985లో ప్రొద్దుటూరు పురపాలిక సంఘం ఛైర్మన్‌గా నెగ్గడం ప్రస్తావనార్హం.

ఇవీ చదవండి...కెరీర్​ డౌన్​ అయినప్పుడల్లా.. నేను లాక్​డౌన్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.