కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొనసాగుతున్న వర్షాలతో.. ఆ గుంతల్లో నీళ్లు చేరుతున్నాయి. ఇంటి బేస్ మట్టం, గోడ కింద భారీగా నీరు చేరిన కారణంగా 15 నుంచి 20 అడుగుల లోతు మేర గుంతలు పడ్డాయి.
నాలుగైదు చోట్ల గుంతలు..
కొత్తగా కట్టిన ఇళ్లల్లో కూడా పెద్ద గుంతలు పడ్డాయని గ్రామస్థులు వెల్లడించారు. ఇలా ఊరిలో నాలుగైదు చోట్ల గుంతలు ఏర్పడ్డాయన్నారు. పైడిపాలెం రిజర్వాయర్లో నీరు అధికంగా ఉండటం, వర్షం ఎక్కువగా కసునూరు పరిధిలోనే కురవడమే గుంతలకు కారణమని పేర్కొన్నారు.
చర్యలు తీసుకోవాలి..
వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. భారీ గుంతలకు నివాసాలు కూలిపోయే ప్రమాదం ఉందని.. ఆందోళన చెందారు. గుంతలు ఎందుకు పడుపడుతున్నాయో అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.