రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే పైపులైను ఎయిర్వాల్ లీకవుతోంది. కడప జిల్లా బ్రహ్మం సాగర్ జలాశయం ద్వారా ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సి ఉంది. ఇప్పుడు ఈ లీకేజీ వల్ల నీరంతా వృథా అవుతోందని స్థానికులు అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో రోజుల తరబడి నీటి వృథా అవుతోంది. నీరు వృథా కావడాన్ని గమనించిన కొందరు లీకేజ్ అవుతున్న ప్రాంతంలో పెద్ద బండరాళ్లను అడ్డంగా ఉంచినా ఒత్తిడితో నీరు బయటికి వస్తోంది. నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి అన్నమయ్య నీరు వదలక చెయ్యేరు కన్నీరు