కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు సీఐ సత్య బాబు తెలిపారు. సరోజినీ నగర్‌కు చెందిన కవిత అనే యువతి.. నీటి కోసం మోటార్ వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిందని చెప్పారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
పీజీ చదువుతున్న కవిత హఠాన్మరణం పలువురినీ కలచివేసింది. కళ్లెదుట కన్న కూతురు మరణించడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: