ETV Bharat / state

వంతెనలేక.. నదిని దాటరాక..16 గ్రామాల ఇబ్బందులు...

Difficulties due to lack of bridge : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని పెన్నానది ప్రవాహానికి వంతెన ఒరిగింది. మరమ్మతులు చేసేందుకని అధికారులు దానిని తొమ్మిది నెలల క్రితం తొలగించారు. ఆ వంతెన నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రజల కోసం తాత్కాలికంగా మట్టిరోడ్డును నిర్మించారు అధికారులు. కానీ వంతెన పనులను ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదు. తాత్కాలికంగా నిర్మించిన రోడ్‌ కూడా వరద ధాటికి కొట్టుకుపోయింది. ఫలితంగా 16గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది వంతెన పరిస్థితి..ప్రజల దుస్థితి.

problems due to lack of bridge
వంతెన
author img

By

Published : Sep 16, 2022, 9:24 AM IST

వంతెన

problems due to lack of bridge : వంతెన ఒరగడంతో ఒక స్తంభాన్ని తొలిగించి తొమ్మిది నెలలు దాటింది. ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదు. తాత్కాలికంగా నిర్మించిన రోడ్‌ కూడా వరద ధాటికి కొట్టుకుపోయింది. ఫలితంగా 16గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని పెన్నానదిపై నిర్మించిన వంతెన పరిస్థితి..ప్రజల దుస్థితి.

వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు వద్ద పెన్నానది ప్రధాన వంతెన ఒరిగిపోవడంతో ఒక స్తంభాన్ని అధికారులు తొలగించారు. పనులు పూర్యయ్యేంతవరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈనెల 7వ తేదీ నుంచి పెన్నానదిలోని మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. 4వేల క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కుల వరకు వరదనీటిని విడుదల చేశారు.

ఆ నీటి ప్రవాహానికి జమ్మలమడుగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు రెండు చోట్ల కొట్టుకుపోయింది. రోడ్డు కూడా తెగిపోవడంతో 16 గ్రామాల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగస్తులు చుట్టూ తిరగలేక వరద నీటిలో నుంచే ప్రమాదకర స్థితిలో నది దాటుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.