ETV Bharat / state

సకాలంలో ఉద్యోగులకు జీతాలు లేవు కానీ..: తులసి రెడ్డి - సీఎం జగన్ పాలన

PCC media chairman Tulasi Reddy fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​పై పీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వట్లేదు కానీ.. రోజుకో సలహాదారుడిని నియమించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు.

Tulasi Reddy
తులసి రెడ్డి
author img

By

Published : Dec 12, 2022, 3:17 PM IST

PCC media chairman Tulasi Reddy fire on CM Jagan: అత్త సొత్తు అల్లుడుకి దానం చేసినట్లు ఉంది ముఖ్యమంత్రి జగన్ వైఖరి అని పీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు దిక్కులేదు కానీ.. ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. రోజుకో సలహాదారుడి నియామకం.. ఒక్కొక్క సలహాదారునికి నెలకు సుమారు 5లక్షల రూపాయల ఖర్చు.. సొంత పత్రిక సాక్షి, టీవీలో ప్రకటనల కోసం ఏడాదికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. మరోవైపు సంవత్సరానికి నూరు కోట్ల రూపాయలతో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సాక్షి పత్రిక పంపిణీ చేయడం.. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీని స్థాపించాలి. కానీ ఎనిమిదిన్నర సంవత్సరాలైనా.. అతీగతి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1055 కోట్లు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వని కారణంగా పనులు ప్రారంభం కాలేదు.. వర్సిటీ వేరే రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునక అని గుర్తు చేశారు.

ఈరోజు సర్ సీపీ బ్రౌన్ 138వ వర్ధంతి సందర్భంగా.. ఆయనను గుర్తు చేసుకుంటూ ఆంగ్లేయుడైన సీపీ తెలుగు భాష నేర్చుకుని..తెలుగు నిఘంటువును రచించి.. తెలుగు ప్రజలకు సూర్యుడుగా ప్రకాశించాడు. కానీ తెలుగువాడైన ముఖ్యమంత్రి జగన్ తెలుగు భాష విధ్వంసకుడిగా తయారుకావడం శోచనీయం అన్నారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో-85 జారీ చేయడం చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. జీవో-85ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందోని తులసి రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.