కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సీతంపల్లెలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ స్థలంలో వైకాపా నాయకుల సహకారంతో కొందరు దౌర్జన్యంగా బోరు వేస్తున్నారనే మనస్తాపంతో వెంకటసుబ్బయ్య, శిరీషలు పురుగుల మందు తాగారు. వీరిని గమనించిన స్థానికులు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంకట సుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దూషించడం వల్లే తన కొడుకు, కోడలు విషం తాగారని అతని తండ్రి రామసుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై ఎదుట పురుగులమందు తాగినా నిర్లక్ష్యం చేశారని వాపోయారు.
ఇదీ చదవండి: