ETV Bharat / state

ఆపరేషన్​ ముస్కాన్​: 257 చిన్నారులకు విముక్తి కల్పించిన పోలీసులు - operation muskan in kadapa district latest news

రాష్ట్ర డీజీపీ సూచనల మేరకు కడప జిల్లాలో ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20 వరకూ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. వీధి, అనాథ బాలలకు శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లను అందజేశారు. బాలలతో మాట్లాడి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. విముక్తి కల్పించిన బాలబాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

operation muskan in kadapa district and saved 257 children
చిన్నారులకు విముక్తి కల్పించిన కడప జిల్లా పోలీసులుc
author img

By

Published : Jul 20, 2020, 10:52 PM IST

కడప జిల్లా వ్యాప్తంగా 257 మంది చిన్నారులను జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విముక్తి కల్పించారు. రెస్క్యూ చేసిన వారిలో 252 మంది బాలురు కాగా, 5 మంది బాలికలున్నారని తెలిపారు. విముక్తి కల్పించిన వారిలో 237 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని చిన్నారులను చైల్డ్​ వెల్ఫేర్​ సెంటర్​లో ఉంచడం జరిగిందన్నారు.

'ఆపరేషన్ ముస్కాన్' ప్రతి సంవత్సరం కొనసాగుతుందన్నారు. చిన్న పిల్లలను బాల కార్మికులుగా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా పిల్లలు మాస్కులు లేకుండా తిరగకూడదన్న ఆదేశాలు ఉన్నాయన్నారు. విముక్తి కల్పించిన పిల్లలకు కరోనా టెస్టులు చేయించామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసు బృందాలను ఆపరేషన్ ముస్కాన్ కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇదీ చదవండి :

ఆపరేషన్​ ముస్కాన్​: 37 మంది బాలబాలికలకు రక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.