కడప జిల్లాలో ఉల్లిధరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగింది. తక్కువ ధరకే ప్రభుత్వం ఉల్లి విక్రయాలు చేపట్టింది. జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో పంపిణీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి కిలో చొప్పున అందజేస్తున్నారు. రైల్వేకోడూరులో ప్రైవేట్ మార్కెట్లో ఉల్లి రూ.100పైగా ఉంది. కుటుంబానికి ఒక కేజీ ఉల్లిగడ్డలు సరిపోవటంలేదని... ఎక్కువగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మలమడుగులో గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బద్వేలులో ఉల్లిపాయల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడ్డారు.
ఇదీ చదవండి: