ETV Bharat / state

Badvel by election: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్ ఆఫీసర్ - బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు(Badvel by election counting)నకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. పది రౌండ్​లలో లెక్కింపు పూర్తవుతుందన్నారు.

Badvel by election
Badvel by election
author img

By

Published : Nov 1, 2021, 5:35 PM IST

బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ(Badvel by election counting) రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ మేరకు బద్వేలు(Badvel) ఏపీ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. 4 హాళ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారికి కేతన్ గార్గ్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.

281 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 28 టేబుళ్లు ఏర్పాటు చేశామని కేతన్ గార్గ్ తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్​లో భద్రపరిచి ఉన్నాయన్న ఆయన.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో వాటిని తెరుస్తామన్నారు. బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ శాతం 68.37 గా ఉందని ఆర్వో తెలిపారు. పది రౌండ్​లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. వర్షం పడిన కౌటింగ్​కు ఏలాంటి ఇబ్బందులు లేవన్నారు.

ఇదీ చదవండి

Badvel bypoll: బద్వేలులో 68.12 శాతం పోలింగ్.. గతంకంటే తక్కువ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.