రహదారి ప్రమాదాల నివారణలో సూచికల పాత్ర ఎంతో ఉంది. ముందున్న మలుపులు, స్పీడ్ బ్రేకర్స్లను గుర్తించి ముందుకు వెళ్లడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటిది కడప జిల్లాలోని మైదుకూరు - ప్రొద్దుటూరు రహదారి మధ్య దెబ్బతిన్న సూచికలు మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు. 18 కిలోమీటర్ల పరిధిలోని జాతీయ రహదారిపై పలుచోట్ల సూచికలు ఒరిగిపోయాయి. రోజులు గడుస్తున్నా.. సంబంధిత అధికారుల చర్యలు మాత్రం శూన్యం. రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకున్న అధికారులు.. సూచికల పునరుద్ధరణకు చొరవ చూపించలేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వాటిని సరిచేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: