ETV Bharat / state

'తెలుగు జాతి ఉన్నంత కాలం తెదేపా ఉంటుంది'

విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను కడప జిల్లాలో తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు అధైర్య పడవద్దని కార్యకర్తల్లో స్థానిక నాయకులు ఉత్సాహం నింపారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న గోవర్ధన్ రెడ్డి
author img

By

Published : May 28, 2019, 12:38 PM IST

కడప జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ పదిలంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి పురస్కరించుకుని కడపలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీ ఓటమి చెందిందని ఏ ఒక్కరూ ఆందోళన పడొద్దని.. 2024లో విజయ పతాకం ఎగరవేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అందరికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

మైదుకూరులోనూ వేడుకలు
నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కడప జిల్లా మైదుకూరులోనూ ఘనంగా నిర్వహించారు స్థానిక తెదేపా కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను ఆర్టీసీ జోనల్ కమిటీ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి కొనియాడారు.

Intro:AP_ONG_82_28_PANDLU_PAMPINI_AV_C7

యాంకర్: ఎన్టీఆర్ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో తెదేపా నాయకులు, కార్యకర్తలు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం నాయుడు బజార్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల వేసి కేక్ కోశారు.

Body:పండ్లు పంపిణీ.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.