ETV Bharat / state

రెండో రోజు జోరుగా నామినేషన్ల పర్వం

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్​, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు కొనసాగింది. రేపు చివరి రోజు కావటంతో నామినేషన్ల దాఖలకు అభ్యర్థులు ఉత్సాహం చూపించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

NOMINATIONS PROCESS CONTINUED IN SECOND DAY FOR MUNCIPALITIES
రెండో రోజు కొనసాగిన మున్సిపల్​ నామినేషన్ల పర్వం
author img

By

Published : Mar 12, 2020, 7:51 PM IST

రెండో రోజు కొనసాగిన మున్సిపల్​ నామినేషన్ల పర్వం

కడప కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 5 డివిజన్లకు ఒక్కో కార్యాలయాన్ని కేటాయించి అక్కడ 5 డివిజన్లకు సంబంధించి అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేస్తున్నారు. పత్రాలు దాఖలు చేసేందుకు రేపు చివరి రోజు కావటంతో చాలా మంది ఈరోజు నామ పత్రాలు దాఖలు చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థుల నామ పత్రాల్లో తప్పులు ఉండటంతో రిటర్నింగ్ అధికారి వెనక్కి పంపించారు. కడప జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జమ్మలమడుగు నగర పంచాయతీకి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ పట్టణంలో ఎన్నికలు జరిపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జమ్మలమడుగు నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. మొత్తం 20 వార్డులకు, 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సహకారంతో ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని చెప్పారు.

విశాఖ వేపగుంట ఆరో జోన్​లో గ్రేటర్ విశాఖకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇవాళ పది నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో కౌన్సిలర్ల స్థానాలకు నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులూ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చారు. నామినేషన్ల ప్రక్రియను తెదేపా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పర్యవేక్షించారు.

చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో 23వ వార్డుకు సంబంధించి తెదేపా, వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

అనంతపురం కార్పొరేషన్​కు రెండోరోజూ నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. నగరంలోని 50 డివిజన్లలో ఒక్కో కేంద్రానికి సంబంధించి ఐదు డివిజన్లు కేటాయించి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మారెడ్డి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 43వ డివిజన్​కి మాజీ కార్పొరేటర్ తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

ఇదీ చదవండి:'వైకాపా రాక్షసత్వానికి సమానమైన పదం డిక్షనరీలోనూ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.