కరోనా కట్టడికి భౌతికదూరం పాటించాలన్న నిబంధన కడప జిల్లాలో కొన్నిచోట్ల అమలు కావడం లేదు. బద్వేలు కూరగాయల మార్కెట్ నిర్వహణ ఇందుకు నిలువెత్తు నిదర్శనం. పట్టణంలో నెల రోజులుగా ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ సడలింపునకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బద్వేలులోని కూరగాయల మార్కెట్ నిర్వహణ పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా అయితే కరోనా వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బద్వేలు చెన్నంపల్లె కూరగాయల మార్కెట్కు వేల సంఖ్యలో వ్యాపారులు, రైతులు వస్తారు. అక్కడ శానిటైజర్ సౌకర్యమూ లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి :