కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంటడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా కోరల్లో చిక్కుకున్న కోనేటి కాల్వ వీధికి చెందిన ఏడేళ్ల బాలుడి అవ్వా, తాతతో పాటూ నాలుగేళ్ల సోదరికి కరోనా సోకింది. అలాగే టీబీ రోడ్డులో విదేశాల నుంచి వచ్చిన మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు అధికారులు దృవీకరించారు.
తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 66కు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న నమ్మకంతో ఉన్న ప్రజలు ఒక్కసారిగా నాలుగు కేసులు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు.
ఇది చదవండి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు