కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య, ఎన్సీసీ అధికారి మేజర్ విజయ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రమశిక్షణకు నిదర్శనమే ఎన్సీసీ విద్యార్థులన్నారు. విద్యార్థులు ఎన్సీసీలో చేరి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. సమాజ సేవలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యులు కావాలని విజయ భాస్కర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి కడప జిల్లా ఏకగ్రీవం.. ఏకపక్షం