ETV Bharat / state

'మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్​గా గుర్తించాలి' - మైదకూరు ఏఐవైఎఫ్ నాయకుల నిరసన వార్తలు

మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్​గా గుర్తించాలని ఏఐవైఎఫ్ నాయకులు.. కడప జిల్లా మైదకురులో నిరసనకు దిగారు. మీడియా ప్రతినిధులకు 50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.

agitation
ఏఐవైఎఫ్ నాయకుల నిరసన
author img

By

Published : Aug 3, 2020, 4:16 PM IST

మీడియా ప్రతినిధులకు బీమా కల్పించాలని కడప జిల్లా మైదకూరులో.. ఏఐవైఎఫ్ నాయకులు నిరసనకు దిగారు. మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్​గా గుర్తించి... 50 లక్షల రూపాయల బీమా కల్పించాలని ఏఐవైఎప్ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు.. మైదకూరు మదన్ మోహన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై.. ప్లకార్డలు ప్రదర్శిస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ, కరోనా సమయాన్ని అదనుగా తీసుకొని..ఎమ్మార్పీ ధరలకు మించి మందులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐసోలేషన్​లో ఉంటున్న కరోనా బాధితులకు కరోనా కిట్లు అందజేయాలని సూచించారు. హోమ్ క్వారంటైన్​లో ఉంటున్న బాధితులకు పౌష్టికాహారంతో పాటు... ప్రభుత్వ క్వారంటైన్​ సెంటర్​లో అందించే, అన్ని రకాల మందులను అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కడప జిల్లాలో శానిటైజర్‌ తాగి ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.