ముస్లిం యువతులకు వివాహ ఖర్చుల కోసం దుల్హన్ పథకం కింద రూ.లక్ష చొప్పున ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని ఏపీ ముస్లిం మైనారిటీ మహిళా సమాజం ప్రతినిధులు ప్రశ్నించారు. మహిళా సమాజం ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల, ప్రకాశం జిల్లా మార్కాపురం, కడప జిల్లా రాయచోటి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసన తెలిపారు.
‘ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కుమార్తె పెళ్లికి ముస్లిం మహిళల తరఫు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుమార్తె పెళ్లికి రూ.15 కోట్లు ఖర్చు చేసిన ఆయన.. ‘దుల్హన్’ గురించి ముఖ్యమంత్రిని అడగలేదు’ అని పేర్కొన్నారు. ‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహం కాని ఎంతోమంది ముస్లిం యువతులు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఇబ్బందులూ కాస్త పట్టించుకోండి. లేదంటే అల్లా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. పెళ్లికి దుబారా చేయకుండా మంచి హిజాబ్ కళాశాల కట్టొచ్చు కదా?’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదీ చదవండి: