పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలో ఆదివారం రాత్రి ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తానా నుంచి గాంధీ బజార్ మీదుగా నేతాజీ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మైనార్టీ నేతలు, సీపీఐ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాలు వ్యతిరేకించినా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతుందన్నారు. కేంద్రం దిగివచ్చి చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మైనార్టీ నాయకుడు బషీర్, సీపీఐ నాయకులు విశ్వనాథ శ్రీనివాసులు, ఝాన్సీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'జగన్ ఆ విషయం చెప్పుంటే... ఒక్క సీటూ వచ్చేది కాదు'