కడపలో ల్యాబ్ టెక్నీషియన్ హత్య కేసును చిన్న చౌక్ పోలీసులు ఛేదించారు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న శ్రీనివాసులు, అతను పని చేస్తున్న ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో గత నెల 25న ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు,దర్యాప్తు మెుదలు పెట్టగా, శ్రీనివాసులు మృతికి వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు.
స్టాఫ్ నర్స్‌తో సంబంధమే కారణం...
శ్రీనివాసులు పనిచేస్తున్న నర్సింగ్ హోమ్‌లోనే స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్న సుజనాతో ఉన్న చనువు ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకొన్నారు. కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోవటంతో నిందితురాలు హైదరాబాద్ వెళ్లిపోయింది. ఈ సమయంలోనే శ్రీనివాసులకు మరొక మహిళతో వివాహం జరిగింది. తిరిగి సుజనా కడపకు తిరిగి రావడంతో, శ్రీనివాసులు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శ్రీనివాసులకు పెళ్లి అయ్యిందని సుజనకు తెలియటంతో గొడవలు మెుదలయ్యాయి.
పెళ్లికి అడ్డం వస్తున్నాడని...
సుజనాకు ఇంట్లో వారు మరొక అబ్బాయితో నిశ్చితార్థం చేయటంతో శ్రీనివాసులను దూరం పెట్టింది. దీంతో శ్రీనివాసులు వేరే వివాహం చేసుకుంటే ఉరేసుకొని చనిపోతానంటూ నర్సింగ్ హోమ్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమెను భయపెట్టే ప్రయత్నం చేశాడు. శ్రీనివాసులు బతికి ఉంటే, తనకు పెళ్లి జరగదనుకొని భయపడి, మృతుడు మెడకు చీర బిగించుకొని ఉండటంతో మంచంపై నుంచి తోసేసింది. దీంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండి: ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి