ETV Bharat / state

ప్రొద్దుటూరులో గుండెపోటుతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

కడప జిల్లా ప్రొద్దుటూరులో విధుల్లో ఉండగా.. ఓ పారిశుద్ధ్య కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని మేస్త్రికి చెప్పినా పట్టించుకోలేదని తోటి కార్మికులు చెబుతున్నారు.

Municipal sanitation worker dies of heart attack
పురపాలక పారిశుద్ధ్య కార్మికుడు గుండెపోటుతో మృతి
author img

By

Published : Feb 4, 2020, 5:22 PM IST

గుండెపోటుతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

విధుల్లో ఉండగా.. నరసింహులు అనే పారిశుద్ధ్య కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. నెలరోజుల క్రితం నరసింహులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని.. విధుల్లో చేరాడు. అతనికి ట్రాక్టర్​తో చెత్త వేసే పనిని అప్పగించారు. చెత్త వేస్తుండగా.. నరసింహులు కింద పడిపోవటంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మేస్త్రీ జీవలతకు చెప్పిన పట్టించుకోలేదని.. కార్మికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కమిషనర్ రాధ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి నరసింహులు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి, అన్నకు గాయాలు !

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.