కడప మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రెడ్‌జోన్ లో పనిచేస్తున్న కార్మికులకు 50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని, పొరుగు సేవల కార్మికులను రెగ్యూలర్ చేయాలని వారు కోరారు. మున్సిపల్ కార్మికులను సచివాలయాలకు పంపొద్దని కార్మిక సంఘం నాయకుడు రవి డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన - muncipal workers latest news kadapa
మున్సిపల్ కార్మికులను సచివాలయానికి పంపడాన్ని నిరసిస్తూ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
![మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన muncipal workers protest in kadapa muncipal office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7573523-50-7573523-1591876360604.jpg?imwidth=3840)
నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులు
కడప మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రెడ్‌జోన్ లో పనిచేస్తున్న కార్మికులకు 50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని, పొరుగు సేవల కార్మికులను రెగ్యూలర్ చేయాలని వారు కోరారు. మున్సిపల్ కార్మికులను సచివాలయాలకు పంపొద్దని కార్మిక సంఘం నాయకుడు రవి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కడపలో వర్షం...రైతన్నల హర్షం